తనీష్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న మూవీ ‘ప్రేమిక’. ఈ మూవీకి మహింద్ర దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా శ్రుతి నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ట్రైలర్ లో విలన్.. ‘ఆకలితో ఉన్న సింహానికి ఎదురొస్తున్నావ్.. నా మీదకే యుద్ధానికి వచ్చావ్. బతికి బయటవడతావా..’ అని అంటాడు.
దీనికి తనీష్ స్పందిస్తూ.. ‘యుద్దం చేయడానికి ఇది రాజ్యాల గొడవ కాదు.. పోరాడటానికి ఇది ఆధిపత్య పోరు కాదు. మృగానికి దాని మృత్యువు కి మధ్య జరుగుతున్న ఆట. పోరాడగలవా..? చావు నుంచి తప్పించుకోగలవా? దమ్ము ఉంటే ట్రై చెయ్.. ’ అని చేప్పే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకుంటోంది.