జీతాలు భారీగా పెరిగాయి.. వారికి  మాత్రమే - MicTv.in - Telugu News
mictv telugu

జీతాలు భారీగా పెరిగాయి.. వారికి  మాత్రమే

February 1, 2018

జీతాలు పెరిగాయి.. కేవలం లాంఛనప్రాయ పదవుల్లో ఉన్న నేతలకు మాత్రమే.  రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు భారీ పెంచుతున్నట్టుఆర్థిక మంత్రి అరుణ్ జైట్ల తన బడ్జెట్ ప్రసంగంలో  ప్రకటించారు. ప్రస్తుతం రూ. 1.50 లక్షలుగా ఉన్న రాష్ట్రపతి వేతనాన్ని ఏకంగా  రూ.5లక్షలకు పెంచారు. ఉప రాష్ట్రపతికి నెలసరి వేతనం  రూ.1.25 లక్షలు కాగా రూ.4 లక్షలకు పెంచారు.  రాష్ట్రాల గవర్నర్ల వేతనం రూ.1.10 లక్షలు వుండగా  రూ.3.5 లక్షలకు  పెరిగిపోయింది. అలాగే ఐదేళ్లకు ఓసారి వేతనాలను పెంచే దిశగా చట్టం తేనున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఎంపీల జీతభత్యాల పెంపుకు కూడా ఒక విధానాన్ని రూపొందించామని,  ద్రవ్యోల్బణాన్ని అనుసరించి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎంపీల జీతాలు ఆటోమెటిక్‌గా పెరుగుతాయని చెప్పారు. .రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని ఇదివరకే వార్తలొచ్చాయి.