పిల్లలకు బువ్వపెట్టిన మోదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలకు బువ్వపెట్టిన మోదీ..

February 11, 2019

ఆకలిని పారదోలడానికి కృషి చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘థర్డ్ బిలియన్త్ మీల్’ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. పేద విద్యార్థులకు భోజనం వడ్డించారు.

బృందావన్ చంద్రోదయ మందిర్ క్యాంపస్‌లో ఫౌండేషన్ నిర్వహిస్తోన్న కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 10,500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.

Telugu News Prime Minister Of India Serves 3 Billionth Akshaya Patra Meal Today In Vrindavan.

అనంతరం మోదీ ‘అక్షయ పాత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషి అమోఘం. ఇందులో భాగమైన వారందరికీ అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మానవ వనరులు శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌, బీజేపీ ఎంపీ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు. Telugu News Prime Minister Of India Serves 3 Billionth Akshaya Patra Meal Today In Vrindavan