ఈ తెలుగు నటుణ్ని గుర్తుపట్టారా? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ తెలుగు నటుణ్ని గుర్తుపట్టారా?

February 28, 2018

ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా?  చెప్పలేకపోతున్నారా?  ఈ కుర్రోడు ఎవరో కాదు తెలుగు యువనటుడు ప్రిన్స్.  కొత్త‌లుక్‌లో ఇలా ఆదరగొడుతున్నాడు. కొత్తగా అవకాశాల్లేకపోయినా మరో రూట్లో ట్రై చేద్దామనుకుంటున్నాడేమో. ప్రిన్స్ దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరెక్కిన ‘నీకు నాకు ’ సినిమాలోె హీరోగా నటించాడు. తర్వాత ‘బస్ స్టాప్’, ‘రొమాన్స్’ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు‌ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా కూడా మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే బిగ్ బాస్‌షో తర్వాత ప్రిన్స్ పూర్తిస్థాయిలో సినిమాల మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకోసం  చాలా కష్టపడి  న్యూలుక్‌లో దర్శనమిచ్చాడు. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్‌లా కనిపించిన ప్రిన్స్ సిక్స్ ప్యాక్‌లో కనిపించి ఆదరగొట్టాడు. ఈ మార్పుకు  కారణం తన కొత్త సినిమా కోసమని సినీ సమాచారం.