వీడియోకాల్‌లో ఖైదీలు బంధువులతో మాట్లాడుకోవచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియోకాల్‌లో ఖైదీలు బంధువులతో మాట్లాడుకోవచ్చు

March 26, 2018

పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఖైదీల కుటుంబాలకు ఓ శుభవార్త చెప్పింది. జైలులో వున్న ఖైదీలతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌లో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం ఖైదీల కుటుంబీకులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ వెబ్‌సైట్‌ ద్వారా లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం తమ వివరాలను దరఖాస్తు చేసుకోవాలి.అన్నీ పూర్తయ్యాక ఏ సమయంలో మాట్లాడాలన్న విషయాన్ని అధికారులు ఫోన్‌కు వివరాలు పంపిస్తారు. ఆ నిర్ణీత సమయంలో ఖైదీతో వీడియో కాల్‌లో మాట్లాడుకోవచ్చన్నమాట. ఇకనుండి జైలుకు వెళ్ళిన బంధువులకు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదంటున్నారు. వీడియోకాల్ వెసలుబాటుతో ఖైదీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.