mictv telugu

అత్యాచార బాధితురాలి బిడ్డను అమ్ముకున్న డాక్టర్..

February 9, 2019

ప్రాణం పోయాల్సిన డాక్టర్లు ప్రాణాలు తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రాణాలు కూడా అమ్ముకుంటున్నారు.  అప్పుడే పుట్టిన బిడ్డ.. చనిపోయిందని చెప్పి అమ్మాకానికి పెట్టిందో ఓ డాక్టరమ్మ.. ఈ ఘటన కృష్ణ జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది.బందరు మండలం సత్రవపాలెంకు చెందిన కనకదుర్గ వికలాంగురాలు. ఆమెపై బావ అత్యాచారానికి తెగబడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ నెల 3న రాజుపేటలోని వాణికుసుమ ఆస్పత్రిలో  మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డను తల్లికి చూపించకుండా డాక్టర్ రెండుమూడ్రోజులు గడిపింది డాక్టర్ వాణికుసుమ. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు బిడ్డను చూపించాలని వేడుకున్నారు.  పుట్టింది బిడ్డ కాదు గడ్డ మాత్రమే అంటూ వైద్యురాలు బుకాయించడం మొదలు పెట్టింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైద్యురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్నల్యాబ్ టెక్నీషియనే బిడ్డను అపహరించి విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. లక్ష్మినారాయణ అనే వ్యక్తికి బిడ్డను అమ్మినట్లు చెప్పారు. దీంతో విజయవాడకు వెళ్లిన పోలీసులు బిడ్డను తీసుకొచ్చి తల్లికి అప్పగించారు.