‘కన్ను’కుట్టిని ఇంటి నుంచి పంపేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

‘కన్ను’కుట్టిని ఇంటి నుంచి పంపేశారు..

February 13, 2018

కేరళ చిన్నది ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. లవ్లీగా కన్నుకొట్టి… కేవలం 20 సెకన్లలో తన హావభావాలతో నెటిజన్లలతో పాటుగా హీరోలను కూడా ఫిదా చేసింది ఈ నటి. అయితే ఆ అభిమానమే కొంప ముంచేసింది. విలేకర్లు, కెమెరామెన్లు ఆమె ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. కొందరైతే ఇంట్లోకి బలవంతంగా వెళ్లడానికి యత్నిస్తున్నారు. ప్రియతో ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నారు.

ఇదంతా ప్రియ కుటుంబానికి సంతోషం కలిగిస్తోంది. అయితే ఈ హడావుడిలో ఏదైనా జరగరానిది జరుతుందోనన్న భయమూ ఉందని ప్రియ తల్లి ప్రీతా తెలిపారు. తనకు మీడియా ప్రతినిధులు పలుసార్లు ఫోన్లు చేస్తున్నారని, ఈ గోల భరించలేక తన కూతురిని హాస్టల్‌కు పంపించానని చెప్పింది.

‘ఉన్నట్టుండి ఇంత క్రేజ్ రావడంతో ఇబ్బందిగా ఉంది. మీడియా పేరుతో దుండగులు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అందుకే ముందు జాగ్రత్తగా ఆమెను హాస్టల్‌కు పంపాను. ఈ హడావుడి తగ్గేవరకు అక్కడే ఉంటుంది’ అని  తెలిపారు.  ప్రియ నటిస్తున్న  ‘ఒరు అదార్ లవ్‌‘ చిత్రం పాటలో ఆమె కన్నుకొట్టిన సీన్‌ను సోషల్ మీడియాలో అరకోటిమందిపైగా చూడ్డం తెలిసిందే.  ఆ చిత్ర  దర్శకుడు కూడా సినిమా విడుదలయ్యే దాకా ప్రియ ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని చెప్పాడట. సినిమా కొంత మాత్రమే పూర్తయిందని, ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉందట.