జుకర్‌బర్గ్‌ని మించిపోయిన ప్రియా ప్రకాశ్ - MicTv.in - Telugu News
mictv telugu

జుకర్‌బర్గ్‌ని మించిపోయిన ప్రియా ప్రకాశ్

February 22, 2018

మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక కనుసైగతో  ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఈ అమ్మడికి రోజు రోజుకు ప్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఫాలోవ‌ర్స్ ప‌రంగా ఇప్ప‌టికే స‌న్నీలియోన్‌, క‌త్రినా కైఫ్ వంటి సెల‌బ్రిటీల‌ను క్రాస్ చేసిన ప్రియా వారియ‌ర్ తాజాగా ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌‌ను కూడా  మించిపోయింది. ఆయ‌నకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేర‌ళ కుట్టికి 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.  ప్రియా ఏదైన పోస్టు పెడితే చాలు వెంటనే మిలియన్స్‌కి పైగా లైకులు,వ్యూస్ వస్తున్నాయి.

సోష‌ల్ మీడియా సంచ‌ల‌నంగా మారిన ప్రియాకు అంటే యూత్ కు ఎంత క్రేజో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ భామకు ప‌లు సినిమాల‌లో ఆఫ‌ర్స్ కూడా క్యూ క‌డుతున్నాయి. టాలీవుడ్‌లో నిఖిల్ స‌ర‌స‌న నటించే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.