ఇష్టసఖుడి బర్త్‌డే.. ప్రియా ప్రకాశ్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇష్టసఖుడి బర్త్‌డే.. ప్రియా ప్రకాశ్ ట్వీట్

April 23, 2018

కన్ను కొట్టి కోట్లమంది ప్రేక్షకులను  ఫిదా చేసిన నటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ’ అనే పాటలో ఆమె పలికించిన హావభావాలకు అభిమానులు మంత్రముగ్ధులు అయ్యారు.ఈ రోజు ప్రియకు ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు. ఎవరో వ్యక్తి అనుకుంటున్నారా? మరి ఎవరో కాదు . ‘ఒరు అదార్ లవ్’ హీరో రోషన్ అబ్దుల్ రహూఫ్ పుట్టిన రోజు.

ఈ సందర్బంగా ప్రియా ట్వీట్ చేసింది..‘నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? ఎందుకంటే మీకందరికీ తెలుసు’ అని చిలిపిగా ముక్తాయించింది. ‘ఒరు అదార్ లవ్ ’ చిత్రానికి ఒమరు లులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం  జూన్ లో విడుదల కానుంది.