ప్రియా ప్రకాశ్‌కు సాయిపల్లవి హితబోధ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా ప్రకాశ్‌కు సాయిపల్లవి హితబోధ

March 5, 2018

కన్నుగీటి అందర్నీ రాత్రికి రాత్రే తన వైపు తిప్పుకుని దేశమంతా ఫేమస్ అయిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ అంటే కుర్రకారు పడిచస్తోంది. దాంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయి మలయాళంలోనే కాదు ఇతర భాషల నుంచీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతల్ సై అంటున్నారు. అయితే ఇదంతా పాలపొంగు అని, కాస్త ఆచితూచి నడుచుకోవాలని మరో కుర్ర హీరోయిన్ సాయిపల్లవి హితబోధ చేస్తోంది.మొదటి సినిమా విడుదల కాకముందే వరుస చాన్సులు సంపాదించుకుంటున్న  ప్రియి ఇకపైన చాలా జాగ్రత్తగా వుండాలని సాయిపల్లవి అంది. స్టార్‌డమ్ సంపాదించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలాకష్టమని చెప్పింది. ఇక మీదట మరింత శ్రద్ధతో ఆలోచించి సినిమాలకి సైన్ చేయాలనీ సూచించింది. పారితోషికం గురించి కాకుండా కథాకథనాలు, పాత్రను గురించి ఆలోచించాలని చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే .. కెరియర్ పరంగా తనలాగే ముందుకెళ్లకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయాన్ని స్పష్టం చేసిందన్న మాట.