కన్నుకొట్టిన ప్రియా కోసం.. క్యూ కడుతున్న కంపెనీలు ! - MicTv.in - Telugu News
mictv telugu

కన్నుకొట్టిన ప్రియా కోసం.. క్యూ కడుతున్న కంపెనీలు !

March 7, 2018

కన్ను గీటి రాత్రికి రాత్రే స్టార్ అయిన మలయాళ నటి  ప్రియా ప్రకాశ్ వారియర్ కోసం పలు కంపెనీలు అత్యధిక రెమ్యూనేషన్ చెల్లిస్తామంటూ క్యూ కడుతున్నాయి . ఆమె నటించిన తొలిచిత్రం ‘ ఒరు అదాల్ లవ్’ సినిమాలో ఆమె కనుసైగలతో అభిమానులను విశేషంగా ఆకర్షించింది. దాంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవర్స్ ఆమాంతం 5.8 మిలియన్లకు పెరిగిపోయారు. ఇప్పుడు ఆమె పాలిట ఇదే వరమైంది.

ఆమెకున్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు పలు కంపెనీలు వరుసగా క్యూ  కడుతున్నాయి. ప్రియా సోషల్ మీడియా అకౌంట్‌లో తమ ఉత్పత్తి గురించి ఓ  పోస్టు పెడితే రూ. 8 లక్షలు ఇస్తామంటూ పలు కంపెనీలు ఆమెకు ఆఫర్లు ఇస్తున్నాయి.