శ్రీదేవికి పాటతో నివాళి అర్పించిన ప్రియ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవికి పాటతో నివాళి అర్పించిన ప్రియ

February 27, 2018

మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ అందాల నటి శ్రీదేవికి అద్బుతమైన నివాళిని  అర్పించింది. కన్ను కొట్టి, గన్నుతో కాల్చే సైగలతో దేశాన్నేతన వైపు తిప్పుకున్న ప్రియ మంచి సింగర్ కూడా అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రియ ఓ చక్కని పాటతో శ్రీదేవికి నివాళి అర్పించింది. ‘కభి అల్విద న కెహనా ’ అంటూ పాటను అద్బుతంగా పాడి ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘చరిత్ర ఎప్పుడూ గుడ్ బై చెప్పదు ,మళ్లీ కలుస్తా అనే అంటుంది’ అని కూడా  రాసుకొచ్చింది ప్రియ. శ్రీదేవి మృతదేహం అప్పగింతపై జరిగిన జాప్యంపై  మీడియా వ్యవహరిస్తున్న తీరుపైనా  ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన సమాచారం లేకుండా ఎందుకు తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ మరో ట్వీట్ చేసింది.