సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రియా... - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రియా…

February 19, 2018

మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని ‘ మాణిక్య మలరాయ పూవీ’ పాటను తొలంగిచాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాట వలన ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ముస్లిం సంఘాలు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో  చిత్ర యూనిట్‌పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

చిత్ర యూనిట్‌పై కేసు నమోదును ఛాలెంజ్ చేస్తూ చిత్రంలోని నటి ప్రియా ప్రకాశ్ వారియర్  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చిత్ర యూనిట్‌పై హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో కూడా  కేసులు నమోదయ్యాయి.