ప్రియపై సుప్రీంలో హైదరాబాద్ ముస్లింల కేసు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియపై సుప్రీంలో హైదరాబాద్ ముస్లింల కేసు

April 9, 2018

కన్ను కొట్టిన చిన్నది ప్రియా ప్రకాశ్ వారియర్‌పై సుప్రీంకోర్టులో మరో కేసు నమోదైంది. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ సినిమాలో ‘మాణిక్య మలరాయ’అనే పాటలో ప్రియ కన్ను కొడుతూ పలికించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇది తమ మనోభావాలను కించపరచేలా ఉందని హైదరాబాద్‌కి చెందిన కొందరు ముస్లింలు ప్రియపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ వేశారు. కన్ను కొట్టడం ఇస్లాంకు వ్యతిరేకమని పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమా విడుదలకు అంగీకరించే ముందు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ పాట గురించి గతంలో దర్శకుడు ఒమర్‌ లూలూ మాట్లాడుతూ..‘1978 కాలం నుంచి కేరళలో ఈ పాట చాలా ఫేమస్‌ అయింది. అప్పట్లో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు?’ అని మండిపడ్డారు.

అయితే ఈ పాట ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ గతంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు ముస్లింలు ప్రియపై,లులుపై కేసు పెట్టారు. దీనిపై ప్రియ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా ఉండేలా చూడాలని కోరింది. ఈ కేసులో సుప్రీం తీర్పు ప్రియకు అనుకూలంగానే వచ్చింది. ఈ వివాదాల నేపథ్యంలో మార్చి 1న విడుదల కావాల్సిన సినిమా జూన్‌కు వాయిదా పడింది.