ప్రియా వారియర్ కేసు.. నవ్వుకున్న జడ్జీలు! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా వారియర్ కేసు.. నవ్వుకున్న జడ్జీలు!

February 23, 2018

 

మళయాల నటి ప్రియా వారియర్ కన్ను కొడితే  కొన్ని రోజుల నుంచి కోట్ల మంది ఫిదా అయ్యారు.  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాత్రం నవ్వుకున్నారు. ప్రియా వారియర్ నటించిన ‘ఒరు ఆధార్ లవ్’ లోన మాణిక్య మలరాయ పూవీ  పాట మా మనోభావాలను దెబ్బతీసింది అని ముస్లిం సంఘాలు  ప్రియపై మరియు డైరెక్టర్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే.అయితే  సుప్రీంకోర్ట్ లో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుండగా  బెంచ్ కు సంబంధించిన ముగ్గురు న్యాయమూర్తులు  ఆ పాటపై నమోదైన కేసును తలుచుకుంటూ పగలబడి నవ్వుకున్నారు. న్యాయమూర్తుల  ప్రవర్తన చూసి  కోర్టులో ఉన్నవారంతో ఒక్కసారిగా షాకయ్యారు. అయితే  ఆ పాటలో ఉన్న లిరిక్స్ కు  నటి ప్రియకు ఏమిటి సంబంధం? ఆమె ఆ పాటను రాయలేదు కదా? అని ప్రధాన న్యాయమూర్తి  దీపక్ మిశ్రా  ఈ కేసుకు సంబంధించి స్టే విధించారు. దీనితో నటి ప్రియా ఇంకా దర్శకుడు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఓ కేసు విచారణ సమయంలో ఎవరైనా శబ్ధం చేస్తే ఆర్డర్ ఆర్డర్ అంటూ సుత్తెతో  బల్లపై కొట్టే  న్యాయమూర్తులే ..ఇలా ప్రియా వారియర్ విషయంలో పగలబడి నవ్వడంతో అది హాట్ టాపిక్’గా మారింది.