టాలీవుడ్‌లోకి ప్రియ.. అప్పుడే 2 కోట్లు డిమాండ్! - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్‌లోకి ప్రియ.. అప్పుడే 2 కోట్లు డిమాండ్!

February 16, 2018

కేవలం టీజర్‌తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమెను తెలుగు తెరకు పరిచయం చెయ్యటానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిఖిల్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం కథానాయికగా ప్రియా వారియర్‌ను సంప్రదించారట.ఫిలిం నగర్ కథనాల ప్రకారం.. ప్రియ డేట్స్ చూస్తున్న ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ లులు రెండు కోట్లు డిమాండ్ చేసార‌ు. దీంతో నిఖిల్, తరుణ్ చిత్ర బృందం ఆలోచ‌న‌లో ప‌డింది. ప్రస్తుతం ప్రియ మలయాళంలో ‘ ఓరు అదార్ లవ్‌ ‘ చిత్రంలోనే నటిస్తోంది. అందులోని కన్నుకొట్టే  టీజరే వైరల్‌గా మారింది. ఇంకా తను నటించిన సినిమా విడుదల కానేలేదు.. అది విడుదలైతే హిట్టో, ఫట్టో తెలియదు.. అప్పుడే ఈ కుర్ర హీరోయిన్‌కు ఇంత డిమాండా ? అని ఆశ్చర్యపోతోంది టాలీవుడ్ ఇండస్ట్రీ. సినిమా హిట్టయ్యాకే ఆ సినిమాలో నటించిన నటీనటులను సంప్రదిస్తారు ఎవరైనా.. కానీ ప్రియా విషయంలో అదంతా రివర్స్ అయిందనే చెప్పుకోవాలి. కేవలం కనుసైగలతోనే క్రేజ్ సంపాదించుకుంది.