ప్రియ షాపింగ్ మాల్‌కు వెళ్లిందట - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియ షాపింగ్ మాల్‌కు వెళ్లిందట

April 2, 2018

లక్కీస్టార్ అంటే ప్రియా ప్రకాశ్ వారియరే. సినిమా విడుదలకు ముందే తెగ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఏం చేసినా వార్తే. ప్రియా తాజాగా ఎర్ర గౌను వేసుకుని  కుటుంబ సభ్యులతో షాపింగ్‌కు వెళ్లింది. హు.. ఇదీ వార్తేనా అని అనుకుంటాం కదా. కానీ ప్రియా అభిమానులకు మాత్రమే అది పెద్ద వార్తే. అందుకే ఈ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియ ఎస్కలేటర్‌పై బామ్మను చెయ్యి పట్టుకుని తీసుకెళ్తోంది వీడియోలో.

 

అభిమానులు ఆమెతో సెల్ఫీలకు ఎగబడ్డారు. పోటీలు పడి మరీ సెల్ఫీలు దిగారు. ‘ఒరు ఆదార్ లవ్ ’ అనే మలయాళీ సినిమాలో నటిస్తోంది ప్రియ. ఒమర్ లూలూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అనేక వివాదాలను చుట్టుముట్టుకుంది. జూన్ 14 న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదల అయితే ప్రియ ఇంకెంత ఫేమస్ అవుతుందో అంటున్నారు సినీ విశ్లేషకులు.