ప్రియదర్శి వివాహ విందు ఫోటోలు... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియదర్శి వివాహ విందు ఫోటోలు…

February 27, 2018

‘పెళ్లి చూపులు’ సినిమాలో ‘నా చావు నేను చస్తా.. నీ కెందుకు ’ అంటూ ప్రేక్షకులను అలరించిన  నటుడు ప్రియదర్శి ఓ ఇంటివాడయ్యాడు. రిచా శర్మ అనే అమ్మాయిని  ప్రేమించి, పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లి ఆగ్రాలోని కంటోన్మెంట్‌లోని గ్రాండ్ హోటల్‌లో ఈ నెల 23న వివాహం జరిగింది. 26న సాయంత్రం హైదరాబాద్‌లోని నరేన్ గార్డెన్స్‌లో విందు ఏర్పాటు చేశాడు. సినీ పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.ఈ మధ్యే ‘తొలిప్రేమ,‘అ!’ సినిమాలతో మన ముందుకు వచ్చిన దర్శి ప్రేమికుల దినోత్సవం రోజున తన ప్రేయసికి ప్రేమలేఖ రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాక తన పెళ్లి తేదీని ఖరారు చేసి అందరికి తెలిసేలాగా తన పెళ్లి కార్డునూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.