ప్రియదర్శి పెళ్లి.. ఇక్కడ కాదు..తాజ్‌మహల్ దగ్గర్లో.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియదర్శి పెళ్లి.. ఇక్కడ కాదు..తాజ్‌మహల్ దగ్గర్లో..

February 21, 2018

‘ నీ పని నువ్వు సూస్కో..  నా సావు నేను సస్త ’ అన్న ఒక్క డైలగా‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నాడు ప్రియదర్శి. ఈనెల 23వ తేదీ, శుక్రవారం పెళ్ళి పీటలు ఎక్కనున్నాడు. రాత్రి 7 గంటలకు రిచా శర్మ మెడలో మూడుముళ్లు వేయనున్నాడు.  పెళ్లి ఆగ్రాలోని కంటోన్మెంట్ గ్రాండ్ హోటల్లో జరగనున్నదని ట్విటర్ ద్వారా ప్రియదర్శి తన పెళ్ళి శుభవార్తను పంచుకున్నారు. పెళ్లికార్డు ఇదే.. శర్మ, పులికొండ ఫ్యామిలీ ఆహ్వానిస్తున్న పెళ్లి కార్డు ఇదే.. అంటూ శుభలేఖను కూడా పోస్ట్ చేశాడు.
ఫిబ్రవరి 26న సాయంత్రం హైదరాబాద్‌లోని నరేన్ గార్డెన్స్‌లో రిసెప్షన్‌ను భారీగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు అతనికి  వివాహ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం తను నటించిన ‘ అ ’ ‘ తొలిప్రేమ ’ సినిమాలు విజయవంతమయ్యాయి. చేతి నిండా అరడజను సినిమాలు వున్నాయి. చాలా బిజీ షెడ్యూల్ వుండగా పెళ్ళి తంతును పూర్తి చేసుకునే పనిలో కూడా బిజీగా వున్నాడు దర్శి.