నటుడు ప్రియదర్శి ‘పెళ్లి చూపులు’ సినిమాలో హాస్యనటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో అందరికీ గుర్తుండిపోయేలా ‘నా చావు నేను చస్తా’ అనే డైలాగ్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మహేశ్ బాబు, ఎన్టీఆర్, నాని లాంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లోనూ తనదైన శైలితో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రేమికుల రోజు సందర్బంగా అతడు ట్విటర్ల తన ప్రేయసిని పరిచయం చేస్తూ ఆమెకు ప్రేమలేఖ రాశాడు.‘డియర్ లవ్.. నీపట్ల నా ప్రేమను, ఆలోచనలను పేపర్‌పై అక్షరాలుగా, వాక్యాలుగా కుదించే ప్రయత్నం చేశాను. అది జరిగే పనేనా? నీ గురించి, నీ ఆలోచనల గురించి పూర్తిగా చెప్పాలంటే కొన్ని లక్షల పద్యాలు రాయాల్సి ఉంటుంది. జీవితకాలంలో ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఆ పనిలోనే గడుపుతా. అచ్చం నాలాగే ఉన్న నిన్ను నా జీవితంలోకి తీసుకువచ్చిన విధికి ధన్యావాదాలు చెప్పడం తప్ప మరేం చేయలేను. ప్రతీక్షణం మన స్నేహాన్ని, ప్రేమను పండుగలా జరుపుకుందాం. హ్యాపీ బర్త్‌డే రిచా..! మై డార్లింగ్ వేలంటైన్.. నిన్ను ప్రేమించడం కంటే నాకు ఇంక ఏదీ ఎక్కువ కాదు` అంటూ ప్రియదర్శి తన ప్రియురాలికి ప్రేమలేఖ రాశాడు.
— Priyadarshi (@priyadarshi_i) February 13, 2018