ట్విటర్‌లోకి ప్రియాంకా గాంధీ..  పోటెత్తిన ఫాలోవర్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్విటర్‌లోకి ప్రియాంకా గాంధీ..  పోటెత్తిన ఫాలోవర్లు..

February 11, 2019

రాజకీయ నాయకులంటే.. టీవీల్లో, వార్తల్లోనే కనిపిస్తూ.. రాజకీయాల్లో బిజీగా ఉంటారని, ఎన్నికలప్పుడే వారికి క్రేజ్ ఉంటుందనుకుంటారు అందరు. కానీ ఆ రికార్డును బ్రేక్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ. ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ప్రియాంక ప్రజలు, కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ట్విటర్ ఖాతాను ప్రారంభించారు.

Telugu News Priyanka Gandhi Vadra Is Now On Twitter 82k Followers Within Hours.

కానీ ఆమె ఇంకా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఆమె ట్విటర్ అకౌంట్ తెరిచిన గంటల్లోనే ఏకంగా 83,600 మంది ఆమెను ఫాలో అయ్యారు. ప్రియాంక  కూడా కొందరు నేతలను ఫాలో అవుతున్నారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలా, రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలతో పాటు కాంగ్రెస్ పార్టీని ఫాలో అవుతున్నారు. Telugu News Priyanka Gandhi Vadra Is Now On Twitter 82k Followers Within Hours