తలపై గ్లాస్ పగులగొట్టుకున్న ప్రియాంక - MicTv.in - Telugu News
mictv telugu

తలపై గ్లాస్ పగులగొట్టుకున్న ప్రియాంక

February 24, 2018

ప్రియాంక చోప్రా ఈ మధ్య మళ్ళీ ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది. నీర‌వ్ మోదీ వ‌జ్రాల వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌డం ఒక‌టైతే , అర్ధ న‌గ్నంగా అసోం టూరిజం క్యాలెండర్స్‌పై ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఈ అమ్మ‌డికి లేని పోని చిక్కులు వచ్చి పడ్డాయి. ఇదిలా వుండగా ప్రియాంక తలపై గ్లాస్ పగలగొట్టుకొన్న వీడియోతో మళ్ళీ తన అభిమానులను పలకరించింది.

 

ఆ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ‘ బ్యాడ్ డే కార‌ణంగా వైన్ గ్లాస్‌తో త‌ల‌పై కొట్టుకున్నాను. ఉద‌యం తొమ్మ‌ది నుంచి వైన్ టైం వ‌రకు వ‌ర్క్ చేస్తే ఇలాగే జ‌రుగుతుంది. మీరు మాత్రం ఇంట్లో ప్ర‌య‌త్నించ‌కండి. అప్పుడప్పుడు నేను ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాను ’ అంటూ త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షాకింగ్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోను చూసి ఆమె అభిమానులు షాక్‌కు గురి అవుతూ కామెంట్లు చేస్తున్నారు.