విజయ్‌కి భారీగా అడ్వాన్సులు! - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్‌కి భారీగా అడ్వాన్సులు!

February 7, 2018

విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలుగు తెర మీదకు దూసుకొచ్చిన యువ కెరటం. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇచ్చిన బూస్టుతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. కారణం నిర్మాతలు అతని ఇంటి ముందు క్యూలు కట్టి మరీ కోట్లకొద్దీ  అడ్వాన్స్‌లు ఇచ్చి వెళ్తున్నారు. చేతిలో అరడజను సినిమాలు వుండగా ఇంకా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థలో సినిమా చేస్తుండగా మరో క్రేజీ ఆఫర్ విజయ్ ఒళ్ళో వచ్చి వాలింది.మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండతో జూన్ తరువాత ఓ సినిమాను చేయడానికి రెడీ అవుతోంది. ఇందుకోసం విజయ్‌కు రెండున్నర కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయం అవనున్నాడు.  ఈ సినిమాలో రష్మిక మందనను హీరోయిన్‌గా తీసుకున్నారట. ప్రస్తుతం ఈ జంట పరుశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపు దిద్దుకుంటున్న సినిమాలో జంటగా నటిస్తుండటం విశేషం.