ఆడపిల్లల్ని కాపాడండి.. బీజేపీ వాళ్ళనుంచి రక్షించండి.. రాహుల్ గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్లల్ని కాపాడండి.. బీజేపీ వాళ్ళనుంచి రక్షించండి.. రాహుల్ గాంధీ

April 23, 2018

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమనాస్త్రాలు సంధించారు.  ‘ఆడపిల్లల్ని కాపాడండి… బీజేపీవాళ్ల నుంచి రక్షించండి.. ఇదే నా సరికొత్త నినాదం ‘ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ‘బేటీ బచావో’ అని ఓ కలర్ ఇచ్చి లోపల చేస్తున్నదంతా ఇదేనని అన్నారు.

‘రాజ్యాంగాన్ని కాపాడండి’ పేరిట ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో ప్రసంగించిన రాహుల్ పై విధంగా స్పందించారు. కీలకమైన పదవుల్లో ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తులను పెడుతూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. పారిశుద్ధ్య పనులు వాల్మీకులకు ఆధ్యాత్మిక అనుభవంలాంటివని తన పుస్తకం ‘కర్మయోగ్’లో మోదీ పేర్కొన్నారని… దళితులపై మోదీకి ఎంత చిన్న చూపు ఉందో దీంతో అర్థమవుతోందని తెలిపారు. దళితుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. 2019లో దేశ ప్రజలు బీజేపీకి తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు.