బాలీవుడ్ సింగర్ సోను నిగమ్‌ను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారు. దీనితో ముంబై పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. అంతేకాదు ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. ఇంతకీ సినిమాల్లో పాటలు పాడుకుంటూ బిజీ బీజీగా ఉండే ఈ సింగర్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేదే మీ సందేహం కదా? మొన్ననే సుప్రీం కోర్టు సినిమా టాకీస్‌లలో జాతీయగీతం పాడడం తప్పనిసరి కాదు అని తీర్పునిచ్చింది.
అయితే దీనిపై సోన్ నిగమ్ స్పందిస్తూ అసలు నన్నడిగితే సినిమా టాకీస్‌లలో జాతీయగీతం ప్రసారం చేయడం, పాడడం నాకు అస్సలు ఇష్టంలేదు అని చెప్పాడు. దీంతో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు వారు సోన్నిగమ్ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడే కాదు గతంలో ట్విట్టర్లో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోన్నిగమ్పై పలువురు మండిపడ్డారు. దీనితో భావ ప్రకటన లేని చోట నేను ఉండలేను అని ట్విటర్ నుంచి సోను నిగమ్ వైదొలిగారు.