హైదరాబాద్‌కు 4.3, పుణేకు 5.1.. ఉత్తమ పరిపాలనలో - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌కు 4.3, పుణేకు 5.1.. ఉత్తమ పరిపాలనలో

March 15, 2018

ఉత్తమ పరిపాలనేంటి ? ఈ పాయింట్లేంటి? అని పరేషాన్ అయితున్నారా?  భారతీయ నగర వ్యవస్థ వార్షిక సర్వే2017 పేరుపై మనదేశంలో ఉన్న 20 రాష్ట్రాల్లోని 23 నగరాల్లో జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమోక్రసీ  అనే స్వచ్చంద సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో చెత్త తొలగింపు , రోడ్లు, ఫుట్ పాత్‌ల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, వాయు కాలుష్యం, పరిపాలన  ఇవన్నింటినీ పరిశీలించి పలు నగరాలను ఎంపిక చేశారు.

ఇందులో పుణే  మొత్తం 10 పాయింట్లకు గానూ 5.1 పాయింట్లు సాధించి ఉత్తమ పరిపాలన నగరంగా నిలిచింది. ఇక ఢిల్లీకి 4.4, ముంబైకి 4.2  రాగా మన హైదరాబాద్‌కు 4.3 పాయింట్లు వచ్చాయి. బెంగుళూరు, చండీగఢ్, డెహ్రాడూన్, పాట్నా, చెన్నై నగరాలకు తక్కువ పాయింట్లు అంటే కేవలం 3 నుంచి 3.3 పాయింట్లు మాత్రమే  దక్కాయి. అంటే పది పాయింట్లకు కనీసం 5 పాయింట్లు దాటని నగరాలు పది కూడా లేవు. పుణే గతేడాది 9వ స్థానంలో ఉంది ఈ ఏడాది ఏకంగా ఒకటో స్థానంలోకి వచ్చింది.

స్థానిక సంస్థల పనితీరు, చట్టాలు, విధానాల రూపకల్పన, ఆర్టీఐ స్పందలను ఆధారంగా  ఈ అధ్యయనం చేస్తారు. ఇదే సర్వే బయటి దేశాలల్లో చేస్తే దక్షిణాఫ్రికా నగరం జోహన్స్‌బర్గ్ కు 7.6 పాయింట్లు, లండన్ నగరానికి  8.8 పాయింట్లు, న్యూయార్క్ నగరానికి 8.8 పాయింట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో పనితీరు ఎలా ఉందోొ.