అత్యాచారం చేసినోడికి  ఉరిశిక్షే - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచారం చేసినోడికి  ఉరిశిక్షే

November 26, 2017

మధ్యప్రదేశ్ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే  వారికి ఉరిశిక్షను వేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో  చిన్నారులపై, మరియు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 ఈ నిర్ణయానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే మైనర్ బాలికలను(12ఏళ్ల లోపు వారిని)  హత్యాచారం చేసేవారికి ఈ శిక్ష వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. గత రెండు నెలల్లో మధ్య ప్రదేశ్‌లో  చిన్నారులపై, మహిళలపై  వేల సంఖ్యలో లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర శిక్షా స్మృతిని, సెక్షన్లను  సవరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ శిక్షను రేపిస్టులందరికి వర్తింప జేయాలని అక్కడి మహిళలు డిమాండ్ చేస్తున్నారు.