పీఎన్‌బీ స్కాంలో మరో ఇద్దరు భామలు - MicTv.in - Telugu News
mictv telugu

పీఎన్‌బీ స్కాంలో మరో ఇద్దరు భామలు

February 21, 2018

ఇప్పటివరకు పీఎన్‌బీ మెగా స్కాంలో ప్రియాంక చోప్రా పేరే ప్రముఖంగా వినిపించింది. తాజాగా మరో ఇద్దరు బాలీవుడ్ భామల పేర్లు వినిపిస్తున్నాయి. బిపాషా బసు, కంగనా రనౌత్‌లు ఈ కోవలోకి వచ్చారు. నీరవ్ మోదీ మామ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సి తమ సొమ్ము ఎగ్గొట్టారంటూ ఆరోపించారు. గీతాంజలి జెమ్స్ బ్రాండ్ నక్షత్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వున్న తనకు భారీ బకాయి పడ్డారని,  కంపెనీ ఒప్పందంలో భాగంగా 2016 నుంచి తనకు బకాయిలు చెల్లించలేదని ఆరోపించినట్టు  ఎకనామిక్స్‌ టైమ్స్‌ తెలిపింది. కాగా కంగనా కంటే ముందు ఈ కంపెనీకి  ఐశ్వర్య,  కత్రినాకైఫ్‌   ప్రచారకర్తలుగా ఉన్నారు.ఇదిలా వుండగా  గీతాంజలికే చెందిన మరో బ్రాండ్‌ గిలికు  అంబాసిడర్‌గా ఉన్న బిపాసా కూడా మెహుల్‌  చోక్సీపై ఆరోపణలు గుప్పించారు. ఆ సంస్థతో 2008లో తన కాంట్రాక్ట్ ముగిసాక కూడా వార్తా పత్రికలలో తన పోటోలను వాడుకున్నారని బిపాషా బసు ఆరోపించారు. తన మేనేజర్‌ కంపెనీని సంప్రదించినా ప్రయోజనం లేదన్నారు. దీన మూలంగా తాను చాలా జ్యూయలరీ ఎండార్స్‌మెంట్లను కోల్పోయినట్టు వాపోయింది. ప్రస్తుతం గిలి బ్రాండ్‌కు క్రితి సనన్‌ ప్రచార కర్తగా ఉన్నారు. ఈ కుంభకోణం నేపథ్యంలో ప్రియాంక చోప్రా తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తనతో నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా సైతం తన కాంట్రాక్ట్ గతేడాదే ముగిసిందని వెల్లడించారు.