మా బ్రాండ్ అంబాసిడర్ ఎప్పటికీ కోహ్లీనే... పీఎన్‌బీ - MicTv.in - Telugu News
mictv telugu

మా బ్రాండ్ అంబాసిడర్ ఎప్పటికీ కోహ్లీనే… పీఎన్‌బీ

February 24, 2018

భారత్ రెండవ అతి పెద్ద బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400 కోట్ల భారీ కుంభకోణం వెలుగు చూసిన  సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకుపై వస్తున్న వార్తలను ఖండిస్తూ  పీఎన్‌బీ ఓ ప్రకటనను విడుదల చేసింది.  భారత క్రికెట్ విరాట్ కోహ్లి పీఎన్‌బీ‌ బ్యాంకుకు ప్రచారకర్తగా  వ్యవహరిస్తున్నాడు.

కాగా బ్యాంకులో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పీఎన్‌బీతో తన ఒప్పదం రద్దు చేసుకుంటున్నట్టు వస్తున్న అసత్యపు వార్తలపై స్పందించింది. అవన్ని వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ‘ మా బ్యాంకుకు ఎప్పటీకి బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లినే.. అందులో ఎలాంటి మార్పు లేదని’ పీఎన్‌బీ తేల్చి చెప్పింది.  

మరో వైపు బ్యాంక్‌కు సంబంధించిన ఖాతాదారులు కేవలం రూ.3వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని చెప్పింది.  కొత్తగా నగదు విత్‌డ్రాపై ఎలాంటి పరిమితులను విధించడంలేదని వివరణ ఇచ్చింది.