పెళ్లి కూతురు డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా ! - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కూతురు డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా !

March 14, 2018

ఓ పెళ్లి కూతురు అందర్ని ఆశ్చర్యంతో ముంచేస్తూ డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోస్టు చేసిన 20 గంటల్లోనే  ఈ వీడియోకు 7వేలకు పైగా లైకులు,4.3 లక్షల మంది వీక్షించారు.

 

పంజాబ్‌కు చెందినన రషికా యాదవ్   చక్కగా చేతులకు గోరింటాకు పెట్టుకుంది. గాజులు ధరించింది. పెళ్లి నగలను  అలంకరించుకుంది. పెళ్లికి ధరించేందుకు రూపొందించిన చోళితో పాటు జీన్స్ ప్యాంటు వేసుకుంది. దానికి సరిపడే స్నీకర్స్ (షూస్) వేసుకుంది. ఆ తర్వాత ప్రముఖ పంజాబీ గాయకుడు మంక్రీత్ ఔలఖ్ పాట‘ కదార్ ’కు డ్యాన్స్  చేసింది. రషికా బంగ్రా,స్టెప్పులతో పాటుగా బెల్లీ ,బాలీవుడ్ నృత్యాలతో ఆదరగొట్టింది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు ప్రియాంక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రషికా గత 16ఏళ్లుగా కథక్ నృత్యాన్ని నేర్చుకుంటుందట. పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు చాలా ఫిదా అయ్యారు. మరి అలాగే  పెళ్లి కొడుకు ఎంత ఫిదా అయ్యాడో.