శ్రీరెడ్డిపై కోర్టుకెళ్తా.. నిర్మాత రమేష్ పుప్పాల. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డిపై కోర్టుకెళ్తా.. నిర్మాత రమేష్ పుప్పాల.

April 18, 2018

నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్ ’ ద్వారా కొందరు పెద్దలు అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన ఆరోపణలపై నిర్మాత రమేష్ పుప్పాల స్పందించారు.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘నాకు శ్రీరెడ్డి  ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అని మేస్సేజ్‌లు చేసేది. తన ఫోటోలను పంపి కామెంట్ అడిగేది.ఆమె పక్కా ప్రణాళికతోనే ఫోటోలు పంపి గేమ్ ఆడింది. సినీ పరిశ్రమలో ‘డియర్ ,డార్లింగ్ ’అని పిలవడం సర్వసాధారణం. నన్ను కూడా వికలాంగుడంటూ అవమానించింది’ అని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై తాను కోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు.