ఆర్జీవి చేసిన పని నాకు నచ్చలేదు.. పూరీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్జీవి చేసిన పని నాకు నచ్చలేదు.. పూరీ

April 20, 2018

నటి శ్రీ రెడ్డి ,పవన్ కళ్యాణ్‌పై  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం  మరో మలుపు తిరిగింది. దీంతో ఆమెపై పవన్ అభిమానులు కామెంట్లు గుప్పించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తానే శ్రీరెడ్డి చేత  పవన్‌ను తిట్టించానని చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో మెగా కుటుంబం, అంతా కలిసి పవన్‌కు సపోర్ట్‌గా రావడంతో అభిమానుల మద్దతు కూడా పెరిగింది.

 తాజాగా ఈ వివాదంపై వర్మ శిష్యుడు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌  ట్వీటర్ ద్వారా స్పందించారు…. ‘నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కల్యాణ్ గారు ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది . అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు . ఆర్జీవీ చేసిన పని నాకు నచ్చలేదు  ప్రాణం ఉన్నంత వరకూ ఐ సపోర్ట్‌ పవన్‌ కల్యాణ్’ అంటూ ట్వీట్‌ చేశారు