భారతీయ కార్మికులకు ఖతర్ శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ కార్మికులకు ఖతర్ శుభవార్త

November 21, 2017

గల్ఫ్ దేశమన ఖతర్ ప్రభుత్వం కార్మికులకు కొత్త లేబర్ చట్టాన్ని తీసుకువచ్చింది.  విదేశీయులు తమ నివాస ప్రక్రియలను స్వదేశంలోనే పూర్తి చేసుకునే సౌలభ్యాన్ని ఈ చట్టం కల్పిస్తోంది. చట్టం ప్రకారం.. ఇకపై  విదేశీయులు తమ ఫింగర్ ప్రింట్, మెడికల్ చెకప్, వర్క్ కాంట్రాక్ట్, బయోమెట్రిక్ డేటాలపై సంతకం వంటివన్నీ ఖతర్‌కు రాకముందే తమ స్వదేశంలోనే పూర్తి చేసుకునే వీలుంటుంది.  తాజా చట్టం ప్రకారం మెడికల్ టెస్టులు, ఇతరత్రా టెస్టుల్లో ఫెయిలయ్యారని దేశంలోకి తిరస్కరించే కేసులు తగ్గొచ్చు.. ఈ కొత్త ఒప్పందంపై ఖతర్  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సింగపూర్‌కు చెందిన కంపెనీ సంతకాలు చేసుకున్నాయి. ఖతర్  నివాస ప్రక్రియలన్నింటినీ విదేశీ వర్కర్లు తమ స్వదేశంలోనే పూర్తి చేసుకోవచ్చని ఖతర్‌ న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టు చేసినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.  ఈ ప్రాజెక్టు తొలి దశలో 8 దేశాలకు వర్తిస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ట్యునీసియా, నేపాల్, భారత్, ఇండోనేషియా, శ్రీలంకలు వున్నాయి. అక్టోబర్ మొదట్లోనే ఖతర్  ఈ చట్ట ముసాయిదా బిల్లును రూపొందించింది. విదేశీ వర్కర్లు తమ ఉద్యోగాలు మారడం ఇబ్బంది పడకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.