రాథేమా బయోఫిక్.. హీరోయిన్ ఎవరంటే - MicTv.in - Telugu News
mictv telugu

రాథేమా బయోఫిక్.. హీరోయిన్ ఎవరంటే

April 19, 2018

ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. తాజాగా వివాదాస్పద మాతాజీ రాథేమా జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రాథేమాగా పాయల్ ఘోష్ నటించనుంది. ‘జై మాతా దీ’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో పాయల్ ప్రథాన పాత్రలో నటిస్తోంది.‘ పటేల్ కీ పంజాబ్ షాదీ’ చిత్రంలో పాయల్ నటన నచ్చడంతో దర్శకుడు సౌరబ్ వర్మ ఈ సినిమాలో పాయల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని సమాచారం. అయితే ఈ సినిమా రాధేమా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా  ప్రకటించలేదు.