జీఎస్టీ కాదు గబ్బర్‌సింగ్ టాక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

జీఎస్టీ కాదు గబ్బర్‌సింగ్ టాక్స్

October 23, 2017

జీఎస్టీ అనేది ప్రజల పట్ల ఓ విలన్‌గా మారిందని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.  అంతేకాదు జీఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కాదని, గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని రాహుల్ అన్నాడు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ బీజేపీ ప్రభుత్వంపై ఈ విమర్శలు చేశాడు. ఈ జీఎస్టీ వల్ల లక్షల మంది చిన్న చిన్న దందాలు చేసుకొనే వ్యాపారులు రోడ్డున పడ్డారు అని రాహుల్ మోదీపై మండిపడ్డాడు. గుజరాత్‌కు ప్రభుత్వం ఏమీ చేయలేదు, బీజేపీ ఎంత డబ్బులు ఇచ్చినా.. గుజరాత్ యువత అమ్ముడుపోయేందుకు సిద్ధంగా లేరు అని రాహుల్ అన్నాడు.