ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక హోదా’ మేం ఇస్తాం! - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక హోదా’ మేం ఇస్తాం!

March 6, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్యత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ  ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు పార్లమెంట్‌లో కూడా కొందరు ఎంపీలు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడుతూ ‘ వచ్చే ఎన్నికల్లో మేం అధికారంలోకి  వస్తే మొదటగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం’ అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని పార్లమెంట్ వీధిలో కొందరు ధర్నా చేయగా.. మరికొందరు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు చేశారు. వారిని కలిసిన రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు.