గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మగవారి బాత్రూం అనుకొని పొరపాటున ఆడవాళ్ల బాత్రూంకి వెళ్లాడు. గుజరాత్‌లోని ఛోటా ఉడేపూర్ జిల్లా కేంద్రంలో ‘సంవాద్’ పేరిట సదస్సు నిర్వహించారు. రాహుల్ యువతతో ఇంటరాక్ట్ అయ్యాడు. అనంతరం సమావేశం జరిగిన టౌన్‌హాల్ నుంచి బయటకు వచ్చి.. ఆడిటోరియంలోనే ఉన్న టాయ్లెట్లోకి వెళ్లాడు. అయితే అది లేడీస్ టాయ్‌లెట్ (మహిళల మరుగుదొడ్డి), రాహుల్ గాంధీకి ఆ విషయం తెలియదు. టాయ్‌లెట్ తలుపులపైన కూడా బొమ్మలు (సంకేతాలు లేవు). ఓ పేపర్ పై ఇది మహిళల మరుగుదొడ్డి అని గుజరాతీ భాషలో రాసి ఉంది. అయితే రాహుల్ గాంధీకి గుజరాతీ భాష రాకపోవటంతో నేరుగా లేడీస్ టాయ్లెట్లోకి వెళ్లిపోయారు. దీనితో అక్కడున్న మీడియా రాహుల్ గాంధీని పోటోలు, వీడియోలు తీసారు. అక్కడ జరిగిని మూడు గంటల మీటింగ్ కంటే, రాహుల్ పొరపాటే చర్చనీయాంశమైంది. ‘రాహుల్ కు గుజరాతీ భాష చదవటం రాదు, అందుకే ఈ పొరపాటు జరిగింది, దీన్ని మీడియా పెద్ద వార్తలాగ ఫోటోలు,వీడియోలు తీయడం ఏమిటని’ గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిధులు మీడియాపై మండిపడ్డారు.