mictv telugu

రాహుల్ గాంధీ అండ్ కో కు అంత సీన్ ఉందా….

February 13, 2019

జాతీయ స్థాయి రాజకీయాల్లో  పెను సంచాలనాలంటూ పెద్దగా ఏమీ లేవు. మోదీని ఢీకొని  నిలబడతారనే గట్టి పోటీనిచ్చే నాయకుడు ఇప్పటికైతే కన్పించడం లేదు. కాకపోతే మోదీ వ్యతిరేక కూటమి నాయకులు అంతా కలిసి రాహుల్ గాంధీని ముందుకు తెస్తున్నారు. ఆయనే తమ ప్రధాన మంత్రి అభ్యర్థని ఇంతకు ముందే చెప్పారు. ఇందులో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కూటమి ప్రయోగం విఫలం  అయింది. మరి మోదీ విషయంలోనూ అదే జరుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు, మమతా బెనర్జీ, అటు యూపీలో అఖిలేష్, మాయావతిలు వారికి తోడు  ప్రియాంక గాంధీ కూడా సీన్‌లోకి వచ్చారు. వీరంతా కలిసి మోదీని గట్టిగా ఢీకొంటారా అంటే అవును అని నమ్మకంతో సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు.

ముఖ్యమంత్రులు కొందరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఢీకొంటున్నారు. అందులో బెంగాల్, ఏపీలకు చెందినవారు ఉన్నారు. వారివారి రాష్ట్రాల సమస్యలు మాట్లాడుతున్నట్లే ఉంది తప్ప మొత్తం దేశం మీద ప్రభావం చూపించే అంశం లేదు. అందునా సెంటిమెంట్ రగిలించే విషయం అంతకన్నా లేదు. యావత్ దేశాన్ని ప్రభావితం చేసే విషయాలు ఏమైనా ఉంటే… అవి జనాలకు అర్థం అయితే మోదీని తప్పకుండా ఇబ్బంది పెట్టి ఆయనపై విజయం సాధిచే అవకాశం ఉంది.

Telugu news Rahul Gandhi And Co Is that scene so.. All the leaders of the anti-Modi alliance are putting forward Rahul Gandhi..

కానీ రాహుల్ గాంధీ ఎత్తుకున్న రాఫెల్ అంశం గురించి జనాలకు పెద్దగా తెలియదు. ఆ విషయమే వారికి అర్థం కాదు. అలాంటప్పుడు మోదీపై వ్యతిరేకతను ఎలా  పెంచగలరు. ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను ఎలా చూపించగలరు. ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

కాకపోతే కొద్ది రోజులుగా  రాహుల్ గాంధీ మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రైతుల గురించి, నగదు బదిలీ గురించి మాట్లాడుతున్నారు.  ఇవి ఆయనకు ప్లస్ అవుతాయి. ఇవే మోదీకి మైనస్ అవుతాయనే గ్యారెంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన కూడా యేటా ఆరు వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్తున్నారు. జీఎస్టీ తగ్గించామని అంటున్నారు. మునుపటికంటే మోదీ ప్రభ తగ్గిన మాట  వాస్తవమే. కానీ ప్రభుత్వాన్ని కోల్పోయేంతగా ఆయన ప్రభ ఏమీ మసక బారలేదు. పైగా ఆయన కొత్త కొత్త స్కీంలు తెరపైకి తెస్తున్నారు. ప్రజల్లో బలంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులనే ఆయన కట్టడి చేయలేక పోతున్నారు.

రాహుల్ గాంధీ వెంట వస్తున్న 23 పార్టీల నాయకులు బలం కంటే మోదీ బలహీనతలే ఆయనను ఓడించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ దాన్ని పట్టుకోవాల్సి ఉంది. సొంత పార్టీలోనే మోదీకి తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అక్కడ బీఎస్పీ, ఎస్పీ పొత్తులు పెట్టుకున్నాయి. దక్షిణాదిలో మోదీకి అనుకూలంగా వాతావరణం లేదు. ఇవన్నీ మోదీకి మైనస్‌లు అవుతాయి.

కానీ రాహుల్ గాంధీ ఆయన మిత్రులు వీటిని తమకు అనకూలంగా మలుచుకుంటారా  అంటే దానికి గ్యారెంటీ ఏమీ లేదు. ప్రియాంక గాంధీ వచ్చిన తర్వాత రాహుల్‌కు తప్పకుండా సానకూలంగా మారుతుంది వాతావరణం. దానికి తోడు తెలంగాణలో జరిగినట్లుగానే జాతీయ స్థాయిలో జరిగే అవకాశం ఎంత మేరకు ఉందనేది వీరి  ఆందోళన, మోదీని కట్టడి చేసే పని పైన ఆధారపడి ఉంటుంది.Telugu news Rahul Gandhi And Co Is that scene so.. All the leaders of the anti-Modi alliance are putting forward Rahul Gandhi.