పెళ్లెప్పుడయ్యా అంటే.. విధిరాత అన్నాడు... - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లెప్పుడయ్యా అంటే.. విధిరాత అన్నాడు…

October 27, 2017

మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్‌గా పేరొందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్  గాంధీ పెళ్లిపై సరదాగా మాట్లాటాడు. మీ పెళ్లెప్పుడు అని అడగ్గా.. విధిరాతను నమ్ముతానని చెప్పారు.

గురువారం ఢిల్లీలో జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్  సదస్సులో ఈ ముచ్చట చోటుచేసుకుంది. బాక్సర్ విజేందర్ సింగ్ రాహుల్‌ను.. ‘మీ  వివాహం ఎప్పుడు? ’ అని ప్రశ్నించారు. దానిపై స్పందించిన రాహుల్.. ‘ ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడు జరుగుతుంది. నేను తలరాతను నమ్ముతాను..’ అని చెప్పాడు.  విజేందర్ మరో ప్రశ్న అడగారు. దానికి సమాధానంగా తాను జపాన్ కు చెందిన మార్షల్ ఆర్ట్స్ అకిడో విద్యలో శిక్షణ తీసుకున్నాని  ఆ విధ్యలో నిష్ణాతుడినని చెప్పారు. తనకు బ్లాక్ బెల్ట్ కూడా వచ్చిందని తెలిపారు. స్విమింగ్‌లో కూడా శిక్షణ తీసుకున్నాని , తన వ్యక్తిగత విషయాలను చెప్పడం తనకు ఇష్టం ఉండదని రాహుల్ తెలిపారు. అకిడో విద్యలో ప్రావీణ్యం ఉందని చెప్పగానే ఆశ్చర్య పోవడం అక్కడి సభికుల వంతైంది.