రాహుల్‌కు ఇద్దరు ప్రియురాళ్లు! - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్‌కు ఇద్దరు ప్రియురాళ్లు!

December 5, 2017

రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఎవరైనా అడిగే జవాబు రాదు. ‘నేను విధిని నమ్ముతాను.పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది’ అని అంటుంటారు. మరోపక్క.. ఆయన ప్రేమాయణంపై పలు కథానాలు వెల్లుబడ్డాయి.

గతంలో రాహుల్ ఇద్దరు విదేశీ వనితలతో సన్నిహితంగా ఉన్నారని చెబుతారు. అందులో ఒకరితో ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చిందని, అయితే బయటికి చెప్పలేని కారణాల వల్ల  బెడిసికొట్టిందని కాంగ్రెస్ సినీయర్ నేతలు అంటున్నారు.

 ఆఫ్ఘాన్ వనిత నోల్ జహెర్‌తో ప్రేమాయణం నడించిందని 2012 జూన్‌లో ‘సండే గార్డియన్ ’ చెప్పింది.  జహెర్ లండన్‌లో చదువుతున్నప్పుడు రాహుల్‌కు పరిచయం అయింది. ఆమె మతం మార్చుకుని రోమన్ కేథలిక్‌గా మారిందని, ఇటలీలోని సోనియా గాంధీ పూర్వీకుల ఇంటిలో ఉన్న చాపెల్( చిన్న ప్రార్థన మందిరం)లో రాహుల్‌తో కలసి ప్రార్థనలు  చేసేదని ఆ పత్రిక  తెలిపింది. ఇద్దరూ కలిసి ఢిల్లీలో కూడా చట్టాపట్టాలేసుకుని  తిరిగారని ఓ కథనాన్ని ప్రచురించింది. జహెర్ 2013లో ఈజిప్ట్ యువరాజును పెళ్లి చేసుకుంది.

రాహుల్ సన్నిహితంగా ఉన్న మరో విదేశీ యువతి వెరోనిక్ కార్టేలీ.1990లో కేంబ్రిడ్జ్  యూనివర్సిటీలో రాహుల్ వెరోనికాను కలిశారు. 1998లో వీరి స్నేహం బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్‌‌లో జరిగిన ఇంగ్లాండ్, భారత్  క్రికెట్ మ్యాచ్‌ను ఇద్దరూ కలసి చూశారు. 1999లో వెరోనికా, రాహుల్‌తో కలసి అండమాన్‌కు వెళ్లింది.

2003లో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీ కుటుంబంతో, వెరోనికాతో  కలసి కేరళ, లక్షద్వీప్‌లో కలియ తిరగారు. 2004లో తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ‘ఆమె పేరు వెరోనికా ,స్పెయిన్ దేశస్థురాల. ఆమె ఆర్కిటెక్ట్ .నాకు మంచి స్నేహితురాలు అంతే ’ అంటూ రాహుల్ తెలిపారు.