తాను హిందువును కానన్న రాహుల్! - MicTv.in - Telugu News
mictv telugu

తాను హిందువును కానన్న రాహుల్!

November 29, 2017

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్న రాహుల్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుళ్లు, గోపురాలు తిరుగుతున్న ఆయన బుధవారం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి వెళ్లారు. అయితే అక్కడ హిందువులు కానివారు ఎవరైనా వస్తే పుస్తకంలో సంతకం చేయాలి. ఆపుస్తకంలో రాహుల్ సంతకం చేశి గుడిలోపలికి వెళ్లారు.

దీనిపై బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. రాహుల్ గాంధీ మొత్తం మీద హిందువు కానని  ఒప్పుకున్నాడు అంటూ భాజాపా నేతలు సోషల్ మీడియాలో ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. రాహుల్ హిందువు కాదని ఒప్పుకొని, దేవాలయాల చుట్టు తిరిగి ఓటర్లను ఎందుకు మభ్యపెడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

ఈ దుమారంపై కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త మనోజ్ త్యాగి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. గుడిలోకి మీడియా వాళ్లను తీసుకెళ్లేందుకే తాను సంతకం చేశాను. అంతే కానీ ఆతర్వాత ఎవరో కావాలనే రాహుల్ పేరును రిజిస్టర్ లో రాశారని ఆయన  పేర్కొన్నారు.