పేరు మార్చుకున్న రాహుల్‌గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

పేరు మార్చుకున్న రాహుల్‌గాంధీ

March 17, 2018

రాహుల్ గాంధీ తన ట్విటర్ పేరును మార్చుకున్నారు. ‘ ఆఫీస్ ఆఫ్ ఆర్జీ ’ అనే పేరుతో ఇంత వరకు తన ట్విటర్ పేజీని నడుపుతూ వచ్చారు.  ఆఫీస్ ఆఫ్ ఆర్జీ అంటే రాహుల్ గాంధీ కార్యాలయం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పేరుపై నెటిజనుల నుండి తీవ్ర విమర్శలు తలెత్తిన తరుణంలో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గొప్పల కోసం రాహుల్ తన పేరును ఇలా పెట్టుకున్నాడని కామెంట్లు రావటంతో రాహుల్ వెంటనే తన పేరునే పెట్టుకున్నాడు.ఈ క్రమంలో తనపై విమర్శలు చేసిన వారిని తన పెంపుడుకుక్క ప్రేలాపనలుగా పోల్చిన విషయం తెలిసిందే. ఆ కారణంతో రాహుల్ మీద ఇంకా నెటిజనుల విమర్శలు ఎక్కువ అవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ట్విటర్‌లో ప్రస్తుతం రాహుల్ గాంధీ పేరుతోనే తన పేజీని మెయింటేన్ చేస్తున్నాడు.