2019 జనవరిలో గజ్వేల్‌కు రైలు! - MicTv.in - Telugu News
mictv telugu

2019 జనవరిలో గజ్వేల్‌కు రైలు!

February 9, 2018

మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైను పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. వచ్చే యేడాది గజ్వెల్‌కు రైలు నడవాలని ఆయన అన్నారు. రైల్వే లైన్ ,రైల్వే స్టేషన్ల నిర్మాణం ఇతర పనుల పురోగతిని హరీష్ రావు శుక్రవారం నాడు మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన బంగాళాలో సమీక్షించారు.

వచ్చే సంవత్సరం జనవరిలోగా గజ్వేల్ కు రైలు నడిచే విధంగా పనులు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జి.ఎం.వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వే పనులు మరింత వేగవంతం చేయాలని రైల్వే అధికారులను హరీశ్ ఆదేశించారు.మనోహరాబాద్,కొత్తపల్లి మార్గంలో పెండింగ్‌లో  ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. రైల్వే పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా కన్నా నెమ్మదిగా సాగుతున్నట్టు హరీష్ రావు అభిప్రాయపడ్డారు.

సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు గజ్వేల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున రైల్వే లైను పనులు పుంజుకోవాలని రైల్వే అధికారులను మంత్రి కోరారు. సిద్ధిపేట, గజ్వేల్ రైల్వే స్టేషన్ భవనాలను వినూత్న రీతిలో,అత్తాధునికంగా నిర్మించాలని హరీశ్ రావు కోరారు.

మెదక్-అక్కన్నపేట, మనోహరాబాద్ మార్గాల లో రైల్వే లైను నిర్మాణం, ఇతర అంశాలపై కూడా మంత్రి సమీక్షించారు. మనోహరాబాద్-గజ్వేల్ మధ్య రైల్వే లైను పనులు వేగం పుంజుకున్నాయని, ఫేజ్ 2 కింద గజ్వేల్-సిద్ధిపేట పనులు కూడా  చేపడుతున్నట్టు రైల్వే అధికారులు తెలియజేశారు.ఈ సమావేశంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి,రైల్వే సి.ఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు.