అలా జరిగితే.. తత్కాల్ టికెట్లపై 100 శాతం రీఫండ్ - MicTv.in - Telugu News
mictv telugu

అలా జరిగితే.. తత్కాల్ టికెట్లపై 100 శాతం రీఫండ్

February 16, 2018

రైల్వే శాఖ తత్కాల్ ప్రయాణికులకు తీపి కబుర్లు తెలిపింది. రైలు ఆలస్యం, దారి మళ్లింపు, లింక్ లేకపోతే వంటి సందర్భాల్లో తత్కాల్ కింద బుక్ చేసుకున్న టికెట్లపై 100 శాతం రీఫండ్  అందించనున్నట్లు ప్రకటించింది.ఈ-టికెట్లతో పాటుగా కౌంటర్‌లో టికెట్లకు కూడా రీఫండ్ వర్తిస్తుందని తెలిపింది. ఐదు సందర్బాల్లో టికెట్ ధర మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చేల్లిస్తామని ప్రకటించింది.రైలు రావడం మూడు గంటలు అంతకన్నా ఎక్కువ ఆలస్యమైనప్పుడు.

  1. రైలును దారి మళ్లించినప్పుడు.
  2. రైలును దారి మళ్లించిన తర్వాత ప్రయాణికులు ట్రైన్‌ ఎక్కాల్సిన స్టేషన్‌ లేదా దిగాల్సిన స్టేషన్‌ లేదా రెండూ కొత్త మార్గంలో లేకపోతే.
  3. ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్‌ను రైలుకు అనుసంధానించకపోతే, అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించనప్పుడు.
  4. రైలులో రిజర్వేషన్‌ చేసుకున్నదానికి బదులుగా లోయర్‌ క్లాస్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఇష్టపడకపోతే (ఒకవేళ ప్రయాణికులు ఇందుకు అంగీకరిస్తే రెండు టికెట్లకు మధ్య ఉన్న తేడాను రైల్వేశాఖ ఆ ప్రయాణికుడికి చెల్లిస్తుంది).