13 వేల మంది రైల్వే ఉద్యోగుల తొలగింపు.. సెలవుల ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

13 వేల మంది రైల్వే ఉద్యోగుల తొలగింపు.. సెలవుల ఎఫెక్ట్

February 10, 2018

రైల్వే శాఖలో త్వరల్లో భారీగా ఉద్యోగులను  తొలంగించునున్నారు. చాలా కాలం నుంచి అనధికారికంగా సెలవుల్లో ఉంటున్న ఉద్యోగులపై రైల్వేశాఖ  క్రమశిక్షణ చర్య తీసుకుంది. తరచూ  చెప్పాపెట్టకుంటా రోజుల తరబడి సెలవులు తీసుకునే 13వేల మంది ఉద్యోగులను గుర్తించింది. వారిని త్వరలోనే విధుల నుంచి తొలగించనుంది.రైల్వే పనితీరును మెరుగుపరిచేందుకు, ఉద్యోగుల్లో క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతలను పెంచేందుకే రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.రైల్వేల్లో మొత్తం 13లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 13వేల మంది చాలా నుంచి అనధికారిక సెలవుల్లో ఉన్నట్టు గుర్తించారు. వారిని వెంటనే తొలంగించడానికి నోటీసులు వగైరా ప్రక్రియ ప్రారంభించారు.  ఈ మేరకు రైల్వేశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల జాబితా నుంచి వారి పేర్లును తొలగించాలని సంబంధిత అధికారులను రైల్వేశాఖ అధికారులు ఆదేశించారు.