నిరుద్యోగులకు రైల్వే శుభవార్త.. వయోపరిమితి పొడిగింపు.. - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు రైల్వే శుభవార్త.. వయోపరిమితి పొడిగింపు..

February 27, 2018

నిరుద్యోగులకు రైల్వేశాఖ మరోసారి శుభవార్త చెప్పింది.. ఇప్పటికే 89,409 గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ పోస్టులకు సంబంధించి కనీస విద్యార్హతను తగ్గించిన రైల్వేశాఖ తాజాగా అభ్యర్థుల వయో పరిమితిని కూడా మరో రెండెళ్ల‌కు పొడిగించింది. దాంతో మరింత మంది రైల్వేశాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది. పెంచిన దరఖాస్తు రుసుమును కూడా పరీక్ష రాసిన అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. ఈసారి తెలుగుతోపాటు 15 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించారు.-అసిస్టెంట్‌ లోకోపైలట్‌, టెక్నీషియన్‌ ఉద్యోగాలకు సంబంధించి జనరల్‌ అభ్యర్థులకు 28 నుంచి 30  ఏండ్లు. ఓబీసీ అభ్యర్థులకు 31 నుంచి 33 ఏండ్లు .ఎస్సీ, ఎస్టీ ​ అభ్యర్థులకు 33 నుంచి 35 ఏండ్లు పొడిగించింది.

– గ్రూపు డి ఉద్యోగాలకు సంబంధించి జనరల్‌ అభ్యర్థులకు 31 నుంచి 33, ఓబీసీ అభ్యర్థులకు 34 నుంచి 36, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 36 నుంచి 38కి పెంచారు.