రైలు టికెట్‌ను వేరే వారికి బదిలీ చేయొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

రైలు టికెట్‌ను వేరే వారికి బదిలీ చేయొచ్చు

March 10, 2018

ఒకసారి రైలు రిజర్వేషన్ టెకెట్  తీసుకున్నాక దాన్ని రద్దు చేసుకోవాలంటే ప్రయాణికుడికి పెద్ద ప్రయాసే. సమయం, డబ్బు రెండూ వృథా. ఇప్పుడా సమస్యలకు మంగళం పాడింది రైల్వేశాఖ. ఇకపై ప్రయాణికుడు తన టికెట్‌ని వేరొకరికి బదీలు చేసుకునే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది. ప్రయాణికుడు తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే  టికెట్‌ను తనకు తెలిసిన వారు లేదా బంధువుల పేరుమీదకి బదిలీ చేసుకోవచ్చు. ఎవరి పేరు మీద బదిలీ చేస్తుందీ లిఖిత పూర్వకంగా సంబంధిత రైల్వే స్టేషన్‌లో చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్స్‌కి సమర్పించాలి. రైలు బయలుదేరటానికి 24 గంటలు ముందే ఆ పని చేయాల్సి వుంటుంది.టికెట్ కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే ఈ బదిలీ సౌకర్యం వుంటుంది.  ఒకసారే ట్రాన్స్‌ఫర్‌కు వీలుంటుంది. ఒకవేళ విద్యార్థులు తన టికెట్‌ను బదిలీ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ప్రిన్సిపల్ అనుమతి పత్రాన్ని జతచేయాల్సి వుంటుంది.  గతంలో తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఇలా కుటుంబసభ్యలకి టికెట్ బదిలీ సౌకర్యం వుండేది. తాజా వెసులుబాటు ప్రకారం వివాహ వేడుకల సమయంలో బంధువులకు కూడా రిజర్వేషన్ బదిలీ చేసుకునే వీలుంది.