లోపల వేయండి.. బ్యాలెన్స్ పొందండి... - MicTv.in - Telugu News
mictv telugu

లోపల వేయండి.. బ్యాలెన్స్ పొందండి…

April 18, 2018

ఎవరైనా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వాడిన తర్వాత ఏం చేస్తారు? పడేస్తారు. కానీ ఇక నుంచి వాటిని పడేయకండి. ఎందుకంటే వాటి ద్వారా మీ ఫోన్‌కు బ్యాలెన్స్ వస్తుంది మరి.  ఆశ్చర్యపోతున్నారా? అయితే చదవండి మరి. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి, రీసైక్లింగ్ చేయడానికి రైల్వే అధికారులు రీసైక్లింగ్ యంత్రాలను తీసుకొచ్చారు. వాటర్ బాటిళ్లను ఆ యంత్రంలో వేస్తే మీ ఫోన్‌కు బ్యాలన్స్ రీఛార్జ్ అవుతోంది.

ఒడిశా రాజధాని భువనేశ్వర్ రైల్వే‌స్టేషన్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఖాళీ బాటిల్‌ను యంత్రంలో వేసి, కీపాడ్‌పై ఫోన్  నంబరు నొక్కితే 20 సెకన్లలో ఫోన్‌కు ఃరూ.10 భ్యాలెన్స్ వస్తుంది. 200 మిల్లీలీటర్ల నుంచి రెండు లీటర్ల సామర్థ్యం గల ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లను ఈ యంత్రంలో వేయవచ్చు. త్వరలోనే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఈ విధానం ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.