రైల్వేశాఖ  క్యాష్‌బ్యాక్ ఆఫర్.... - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వేశాఖ  క్యాష్‌బ్యాక్ ఆఫర్….

February 22, 2018

రైల్వేశాఖ  జనరల్  కేటగిరీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రైల్వేశాఖలో ఉద్యోగాలకు నిర్వహించే పరిక్షల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరిక్ష రాయాలంటే ఫీజు రూ. 500 చెల్లించాలి.కానీ ఇక నుంచి పరిక్షకు హాజరైతే చాలు అభ్యర్థులకు రూ. 400 తిరిగి క్యాష్ బ్యాక్ ను ఇవ్వనుంది.

పరిక్ష రాసే అభ్యర్థులు పరీక్ష రుసుము రూ.100 మాత్రమే చేల్లించినట్లు అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియా సమావేశంలో ప్రకటించారు. రిజర్వేషన్ లేని అభ్యర్థులు మాత్రం రూ.250లు చెల్లించాల్సి ఉంటుందని పీయూష్ అన్నారు. అయితే పరీక్ష సమయంలో అభ్యర్థి సంతకం భాషపై ఎలాంటి ఆంక్షలు విధించడం  లేదని చెప్పారు.