3 వేల కి.మీ రైలు పట్టాల పొడవునా గోడ

రైలు పట్టాల వద్ద ప్రమాదాలు పెరిగిపోతుండడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్ల మేర గోడ కట్టాలని నిర్ణయించింది. దసరా పండగ నాడు పంజాబ్లోని అమృత్సర్లో ఘోర రైలుప్రమాదం జరగడం, 60 మంది ప్రాణాలు పోగా, ఎన్నో కుటుంబాల్లో విషాదం అలుముకోవడం తెలిసిందే.  ఇలాంటి ప్రమాదాలను దృష్ఠిలో పెట్టుకుని రైల్వే ట్రాక్ పొడవునా గోడ కట్టేందుకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాక్లకు ఇరువైపులా 2.7 మీటర్ల ఎత్తుతో సిమెంట్, కాంక్రీట్ గోడను నిర్మించనుంది. రూ. 2,500కోట్లతో ప్రాజెక్టును చేపడుతోంది రైల్వేశాఖ.Telugu news Railways plans to build 3,000 km of walls guarding tracks to prevent trespassingశివారు ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టనుంది. గోడ కట్టడంవల్ల ఎవరు కూడా రైల్వే ట్రాక్‌లను దాటడానికి వీలుండదు.. పశువులు కూడా గోడ వుండటంతో ట్రాక్ పైకి రావని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే బోర్డు సభ్యులు విశ్వేశ్ చౌబే తెలిపారు. గతంలోనూ ఈ గోడ కట్టే ప్రతిపాదన వుంది. కానీ కార్యరూపం దాల్చలేదు. అమృత్ సర్ ఘటన తర్వత ఈ ప్రతిపాదన కార్యరూనం దాలుస్తోందని వివరించారు. ఇందుకోసం టెండర్లను కూడా ఆహ్వానిస్తోంది. వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ మెదక్ జిల్లా మాసాయి పేట వద్ద బస్సు ప్రమాదంలో పసి పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పుడు రైల్వే గేట్‌ల దగ్గర బ్రిడ్జీలు నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వంతెనల నిర్మాణం చేపడతామని అన్నారు. ఇంతవరకు ఆ పనులు జరగలేవు. ఆ పనులు జరిగితే బాగుండు అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు.